Create Emoji: మీకు నచ్చినట్లుగా ఎమోజీ.. ఒక్క క్లిక్‌తోనే క్రియేట్‌ చేసుకోండిలా..

Create Emoji in simple steps: పాత ఎమోజీలు చూసి చూసీ బోర్‌ కొట్టిందా? మీరే కొత్త ఎమోజీ చేసుకోవాలా? అయితే, గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి సింపుల్‌గా ఇలా క్రియేట్ చేసుకోండి..

Updated : 16 Sep 2023 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా.. ఇలా ఏ యాప్‌ ఓపెన్‌ చేసినా మనకు ఎమోజీలు (Emoji) దర్శనమిస్తాయి. మన స్మార్ట్‌ఫోన్‌లో వాడే కీబోర్డుల్లోనూ బోలెడు ఎమోజీలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి మనకు కావాల్సిన ఎమోజీ మనకు దొరక్కపోవచ్చు. అలాంటప్పుడే అనిపిస్తుంది.. మనమే ఎమోజీ ఎందుకు క్రియేట్‌ చేసుకోకూడదూ అని! అయితే సింపుల్‌గా ఒక్క సెర్చ్‌తో మీరు మీకు నచ్చిన ఎమోజీని డిజైన్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ గతంలో ఎమోజీ కిచెన్‌ పేరిట జీబోర్డులో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా దాన్ని వెబ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌లో ఎమోజీ కిచెన్‌ (Emoji Kitchen) అని సెర్చ్‌ చేసి మీకు కావాల్సినట్లుగా ఎమోజీలను మార్చుకోవచ్చు. ఇందుకోసం తొలుత ఎమోజీ కిచెన్‌ (Emoji Kitchen) అని సెర్చ్‌ చేయాలి. తర్వాత ‘గెట్‌ కుకింగ్’ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే రెండు వేర్వేరు ఎమోజీలను కలిపే ఆప్షన్‌ వస్తుంది. కళ్లద్దాలతో ఉన్న ఎమోజీకి మాస్కూ తొడగొచ్చు.. టెడ్డీ, బన్నీని కలిపేసి ఓ కొత్త జంతువు ఆకారాన్నీ రూపొందించొచ్చు. ఇలా మీకు నచ్చిన ఎమోజీని క్రియేట్‌ చేశాక.. కాపీ ఆప్షన్‌ ద్వారా వినియోగించుకోవచ్చు. అయితే, ఎమోజీ రూపంలో కాకుండా పీఎన్‌జీ ఫైల్‌ రూపంలో మాత్రమే వినియోగించుకునే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని