logo

Obesity: బరువు తగ్గిస్తామంటూ షాక్‌ ట్రీట్‌మెంట్‌

బరువు తగ్గిస్తారనుకుంటే షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి మోసగించారని ఉప్పల్‌కు చెందిన బాధితురాలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుకు ప్రతివాద కలర్స్‌ సంస్థ స్పందించకపోవడంతో సేవల్లో లోపంగా పరిగణిస్తూ

Updated : 10 Feb 2022 07:44 IST

కలర్స్‌ సంస్థకు జరిమానా విధించిన జిల్లా వినియోగదారుల కమిషన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బరువు తగ్గిస్తారనుకుంటే షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి మోసగించారని ఉప్పల్‌కు చెందిన బాధితురాలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుకు ప్రతివాద కలర్స్‌ సంస్థ స్పందించకపోవడంతో సేవల్లో లోపంగా పరిగణిస్తూ కమిషన్‌ జరిమానా విధించింది. పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ తన కూతురు బరువు తగ్గే చికిత్స కోసం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని కలర్స్‌ సంస్థను ఆశ్రయించారు. సహజ పద్ధతిలో చికిత్స అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలుపగా ఆమె తన కూతురును చేర్పించారు. రూ.35 వేలు ఖర్చువుతుందని చెప్పగా.. రెండు దఫాలుగా గత ఏడాది ఏప్రిల్‌లో చెల్లించారు. మూడు సిట్టింగ్‌ల చికిత్సలో భాగంగా షాక్‌ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంతో 76.3 కిలోల బరువున్న తన కూతురు మరో రెండు కిలోలు అదనంగా పెరిగిందని ఆరోపించారు. ఛాతీనొప్పితో బాధపడుతుండటంతో చికిత్స ఆపేసి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా.. అందుకు కలర్స్‌ సంస్థ అంగీకరించలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదుదారు చెల్లించిన రూ.35 వేలు, 6 శాతం వడ్డీతో, పరిహారంగా రూ.5 వేలు, కేసు ఖర్చులకు రూ.2 వేలు చెల్లించాలని.. 45 రోజుల గడువులోగా ఈ డబ్బు చెల్లించకపోతే 9 శాతం వడ్డీ కట్టాలని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని