logo

ఉప్పల్‌లో అభిమానం ఉప్పొంగె

క్రికెట్‌ అభిమానుల కేరింతలతో ఉప్పల్‌ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. మువ్వన్నెల జెండాలు పట్టుకొని భారత జెర్సీలు ధరించి మైదానంలో సందడి చేశారు.

Published : 26 Sep 2022 02:50 IST

తారలు వచ్చిన వేళ.. భారత ఆటగాళ్ల బస్సు మైదానానికి

వస్తున్నప్పుడు అభిమానుల కోలాహలం 

క్రికెట్‌ అభిమానుల కేరింతలతో ఉప్పల్‌ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. మువ్వన్నెల జెండాలు పట్టుకొని భారత జెర్సీలు ధరించి మైదానంలో సందడి చేశారు. నగరానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు మ్యాచ్‌ వీక్షించారు.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సాధన చేస్తున్న విరాట్‌ కోహ్లి

2,500 మందితో భారీ భద్రత

ఈనాడు- హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియం, పరిసర ప్రాంతాల్లో రాచకొండ పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆదివారం దాదాపు 2,500 మంది గస్తీలో పాల్గొన్నారు. హబ్సిగూడ, ఉప్పల్‌ చౌరస్తా సహా చుట్టు పక్కల కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి భద్రత కల్పించారు. స్టేడియం లోపలకంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. మ్యాచ్‌ సాయంత్రమే మొదలైనా ఉదయం 10 గంటల నుంచే అభిమానుల రాక మొదలైంది. సాయంత్రం 5 గంటల తర్వాత స్టేడియం లోపలికి అనుమతించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో ఉప్పల్‌ నుంచి హబ్సిగూడ వరకూ ట్రాఫిక్‌ స్తంభించింది. 

అండగా మేము.. గెలవండి మీరు: మువ్వన్నెల జెండాతో సందడి 

మ్యాచ్‌ సమయంలో మహిళా ప్రేక్షకుల కేరింతలు  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని