logo

దాడి తిప్పికొడదాం

విధుల్లో భాగంగా నేరగాళ్లు దాడులకు తెగబడితే పోలీసులు సమర్థంగా ప్రతిఘటించేలా సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిఫెన్సివ్‌ టాక్టికల్‌ ట్రైనింగ్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ రూపొందించారు.

Published : 27 Sep 2022 06:45 IST

సైబరాబాద్‌ పోలీసులకు డిఫెన్సివ్‌ టాక్టికల్‌ ట్రైనింగ్‌


శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న స్టీఫెన్‌ రవీంద్ర

ఈనాడు- హైదరాబాద్‌: విధుల్లో భాగంగా నేరగాళ్లు దాడులకు తెగబడితే పోలీసులు సమర్థంగా ప్రతిఘటించేలా సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిఫెన్సివ్‌ టాక్టికల్‌ ట్రైనింగ్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ రూపొందించారు. నేరాలకు పాల్పడిన నిందితులు తప్పించుకునేందుకు కొన్ని సార్లు పోలీసులపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ, ప్రతిదాడికి సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని కానిస్టేబుల్‌ యాదయ్య చేతుల మీదుగా కమిషనర్‌ ప్రారంభించారు. యాదయ్య ఇటీవల గొలుసు దొంగల చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు. వివిధ విభాగాలకు చెందిన 30మందికి వారం పాటు తర్ఫీదు ఇస్తారు. సంయుక్త కమిషనర్‌ అవినాశ్‌ మహంతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని