logo

శ్వాసకోశ చికిత్సలకు నిలోఫర్‌లో ప్రత్యేక వార్డులు

నిలోఫర్‌ ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధుల కోసం ప్రత్యేక వార్డులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం దవాఖానాలో వెయ్యి వరకు పడకలు ఉండగా 250 వరకు ఈ వ్యాధులకే అందుబాటులో ఉంచింది. ఈ ఆసుపత్రికి వచ్చే చిన్నారుల్లో ఎక్కువమంది

Published : 30 Sep 2022 03:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధుల కోసం ప్రత్యేక వార్డులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం దవాఖానాలో వెయ్యి వరకు పడకలు ఉండగా 250 వరకు ఈ వ్యాధులకే అందుబాటులో ఉంచింది. ఈ ఆసుపత్రికి వచ్చే చిన్నారుల్లో ఎక్కువమంది లో ఆస్థమా, న్యుమోనియా, జలుబు, దగ్గు లక్షణాలు కన్పిస్తుంటాయి. కొన్నిసార్లు వీరికి ఆక్సిజన్‌ లేదంటే వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందించాలి. శ్వాసకోశ వ్యాధులు ఇతరులకు సోకే ప్రమాదం నేపథ్యంలో.. సాధారణ రోగులతో వీరిని కలిపితే, ఇన్‌ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రత్యేక వార్డులు కేటాయించినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు.  

త్వరలో అదనపు పడకలు... కరోనా నేపథ్యంలో నిలోఫర్‌లో ప్రతి పడకకూ ఆక్సిజన్‌ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఆక్సిజన్‌తో కూడిన పడకలు 400 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం మరో 600 అందుబాటులోకి రానుండడంతో.. శ్వాసకోశ వ్యాధులతో చేరే చిన్నారులకు సమర్థంగా చికిత్సలు అందించేందుకు వీలవుతుందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ఆసుపత్రి పాత భవనంపై అదనంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఇవి పూర్తవుతాయని, అప్పుడు మరో 500 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వైద్య పరీక్షలకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పంపుతున్నారు. అదనపు వార్డుల నిర్మాణంతో అవే సేవలు ఇక్కడా లభించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని