logo

ఉచితం.. కొనసాగిద్దాం

గ్రేటర్‌ ప్రజలకు జలమండలి అధికారులు ఉచిత తాగునీటి పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. నెలకు 20 వేల లీటర్ల వరకూ వినియోగించే వినియోగదారులకు అవకాశాన్ని ఇవ్వాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు.

Updated : 20 Oct 2022 04:06 IST

20 వేల లీటర్ల తాగునీటి పథకంపై అంతర్గత ఆదేశాలు
ఆధార్‌... నల్లామీటరు తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ ప్రజలకు జలమండలి అధికారులు ఉచిత తాగునీటి పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. నెలకు 20 వేల లీటర్ల వరకూ వినియోగించే వినియోగదారులకు అవకాశాన్ని ఇవ్వాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి కనెక్షన్‌కు ఆధార్‌ను ఇంకా అనుసంధానించుకోని వినియోగదారులకు పథకాన్ని వివరించాలని సిబ్బందికి సూచించారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారిలో నెలకు 20వేల లీటర్లు ఉచితంగా ఇవ్వాలని 2020వ సంవత్సరంలో సర్కార్‌ నిర్ణయించింది. డిసెంబరు 1, 2020 నుంచి జలమండలి అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హులైన వారందరికీ ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు అందించేందుకు వీలుగా పథకంలో చేరేందుకు 2021 డిసెంబరు 31 వరకూ గడువు విధించారు. ఇంకా విజ్ఞప్తులు వస్తుండడంతో కొనసాగించాలని నిర్ణయించారు.

ఆధార్‌ అనుసంధానమైనప్పటి నుంచే...
జలమండలి నిబంధనల మేరకు వినియోగదారుడు తన నల్లా కనెక్షన్‌ నంబర్‌తో ఆధార్‌ అనుసంధానం చేసుకున్నప్పటి రోజు నుంచి మాత్రమే ఉచిత తాగునీటి పథకం వర్తిస్తుంది. కొందరు వినియోగదారులు తమకు 2020 డిసెంబరు నుంచి వర్తింపజేయాలంటూ కోరుతున్నందున ఈ విషయంపై జలమండలి అధికారులు స్పష్టతనిచ్చారు. నెలకు 20వేల లీటర్ల కంటే ఎక్కువ వినియోగించుకుంటున్నవారికి 20వేల లీటర్లపైన ఎన్ని లీటర్లు వినియోగించుకుంటే అంతమేరకు నీటి ఛార్జీలను చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని