logo

ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి దించే యత్నం

ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నించిదంటూ ఓ విదేశీ యువతి మరో విదేశీ మహిళపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 29 Jan 2023 02:22 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నించిదంటూ ఓ విదేశీ యువతి మరో విదేశీ మహిళపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుల కథణం ప్రకారం.. ఉగాండాకు చెందిన ఓ యువతి(31) హైదరాబాద్‌లో  ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో కెన్యాకు చెందిన చెరియట్‌్ శైలిన్‌ జెప్టూతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ జెప్టూ ఆ యువతిని నగరానికి రప్పించింది. వచ్చాక వ్యభిచార వృత్తిలోకి దిగాలంటూ ఒత్తిడి చేసింది. విషయాన్ని ఆమె తన స్నేహితుడికి వాట్సాప్‌ ద్వారా తెలియజేసింది. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జెప్టూను అదుపులోకి తీసుకొని విచారించారు. పర్యాటక వీసా పేరుతో 2020లో వచ్చి, గడువు ముగిసినా ఇక్కడే ఉన్నట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని