logo

బహుమతుల ఎర రూ.1.22 కోట్లు స్వాహా

ఖరీదైన బహుమతుల పేరిట అమాయకులను వంచిస్తున్న ఇద్దరు మాయగాళ్లను నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 08 Feb 2023 02:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖరీదైన బహుమతుల పేరిట అమాయకులను వంచిస్తున్న ఇద్దరు మాయగాళ్లను నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌ నగర పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సైబర్‌క్రైమ్‌ డీసీపీ స్నేహమెహ్రా, ఏసీపీ కె.వి.ఎంప్రసాద్‌తో కలిసి నగర సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. హబ్సిగూడ రవీంద్రనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి(60)కి ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. యూకేకు చెందిన డాక్టర్‌ లియోనార్డ్‌గా పరిచయం చేసుకున్నాడు. విదేశీ ఫోన్‌ నంబరు ద్వారా వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేసుకునేవారు. గతేడాది డిసెంబరులో యూకే నుంచి ఖరీదైన వస్తువులు బహుమతిగా పంపుతున్నట్టు చెప్పాడు. తర్వాత విశ్రాంత ఉద్యోగికి దిల్లీ కస్టమ్స్‌ కార్యాలయం నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. యూకే నుంచి వచ్చిన పార్సిల్‌ తీసుకునేందుకు ఛార్జీ రుసుం రూ.35,500 చెల్లించాలంటూ పలు దఫాలుగా రూ.1.22కోట్లు కొట్టేశారు. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు గతేడాది డిసెంబరు 27న సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ నుంచి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఐవరీ డి కోస్ట్‌కు చెందిన బకయోకో లస్సీనా(34), మేఘాలయకు చెందిన షోమా పుర్కాయస్థ(30)ను అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని