ఆడపిల్లనని వదిలేశావా ‘అమ్మ’
తొమ్మిది నెలలు కడుపులో మోశారు.. ఈ లోకానికి రాగానే నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. ఆడపిల్లను.. మీకు భారమవుతాననుకున్నారా..? గుక్క పెట్టి ఏడుస్తున్నా.. మీ గుండెలు కరగలేదా..?
ఇంటి రేకులపై గుర్తు తెలియని పసికందు
ఆసుపత్రికి తరలించగా మృతి
ఆసుపత్రిలో చిన్నారి
జీడిమెట్ల, న్యూస్‌టుడే: తొమ్మిది నెలలు కడుపులో మోశారు.. ఈ లోకానికి రాగానే నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. ఆడపిల్లను.. మీకు భారమవుతాననుకున్నారా..? గుక్క పెట్టి ఏడుస్తున్నా.. మీ గుండెలు కరగలేదా..? అప్పుడే లోకాన్ని చూసిన ఆ పసికందు మాట్లాడితే ఇలాగే ఉండేదేమో.. జీడిమెట్ల అయోధ్యానగర్‌లోని ఓ ఇంటి రేకులపై అప్పుడే పుట్టిన పసికందు(ఆడపిల్ల)ను ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. ఏడుపులు విన్న స్థానికులు చేతుల్లోకి తీసుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ పవన్ ఘటనా స్థలానికి వెళ్లారు. వైద్యం కోసం షాపూర్‌నగర్‌లోని యూహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వెళ్లేసరికి ఆ చిన్నారి మృతి చెందింది. అక్కడ చిన్నారిని ఎవరు వదిలేశారు.. తల్లిదండ్రులే ఆడపిల్ల పుట్టిందని.. వదిలేశారా..? లేకుంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి తీసుకొచ్చి వదిలేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
-
Movies News
Nani: త్రివిక్రమ్‌తో సినిమాపై నాని ఆసక్తికర కామెంట్స్
-
Politics News
Ganta Srinivasa Rao: అలా చేస్తే వైకాపా పెద్ద తప్పు చేసినట్లే.. తన రాజీనామా ఆమోదంపై గంటా క్లారిటీ
-
Sports News
Ind Vs Aus: ఆ బౌల్డ్.. ఈ రనౌట్
-
India News
Amritpal Singh: అశ్లీల సందేశాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్ నేరాల చిట్టా..!
-
Sports News
Suryakumar Yadav: మూడుసార్లు గోల్డెన్ డక్.. సూర్యకుమార్ పేరిట ఓ చెత్త రికార్డు