logo

రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవం..తరించిన భక్తజనం

కుల్కచర్ల గ్రామీణ: బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా సాగాయి. కుల్కచర్ల, పరిగి, వికారాబాద్‌నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ తదితర దూర ప్రాంతాల నుంచి కూడా  భక్తులు తరలివచ్చారు.

Updated : 22 Mar 2023 05:05 IST

ఆలయంలో స్వామి
న్యూస్‌టుడే, కుల్కచర్ల గ్రామీణ: బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా సాగాయి. కుల్కచర్ల, పరిగి, వికారాబాద్‌నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ తదితర దూర ప్రాంతాల నుంచి కూడా  భక్తులు తరలివచ్చారు. ఆలయం ముందరున్న పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని అభిషేక, కుంకుమార్చన, బిల్వార్చన, వంటి ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రాంగణంలో ఏర్పాటైన మిఠాయి దుకాణ సముదాయాల దగ్గర చిన్నారులు, మహిళల సందడి కనిపించింది. పది రోజుల నుంచి కొనసాగుతున్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ ఈవో సుధాకర్‌, చైర్మన్‌ రాములు తెలిపారు. నేటి ఉగాది పర్వదినంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.    

అగ్ని గుండ ప్రవేశం.. ప్రత్యేకం

ఈ ఉత్సవాల్లో ఏటా నిర్వహించే అగ్ని గుండం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శివ భక్తులు నందికోలు ఆడుతూ దేవాలయం నుంచి  కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండం దగ్గరకు వచ్చారు. ఓం నమ:శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో నిప్పులపై నడిచారు.

ఎమ్మెల్యే పూజలు

స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, ఎంపీపీ సత్యమ్మ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ హరిక్రిష్ణ, తెరాస మండల అధ్యక్షుడు రాంరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజు, ఆలయ కమిటీ సభ్యుల సంజయ్య తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని