logo

వీధి శునకాలను దత్తత తీసుకోవాలి

వీధి కుక్కల దాడుల నుంచి నగరవాసులను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 03:01 IST

మేయర్‌ విజయలక్ష్మికి పుస్తకాన్ని అందజేస్తున్న దామోదరాచారి

ఈనాడు, హైదరాబాద్‌: వీధి కుక్కల దాడుల నుంచి నగరవాసులను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాలపై భాజపా కార్పొరేటర్లు శ్రవణ్‌, సీ.ఎన్‌.రెడ్డి, పశువైద్య విభాగం అధికారులతో ఆమె శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరిపారు. కుక్కల సమస్యను నియంత్రించేందుకు ఎన్జీవోలతో పాటు పౌరులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని కోరారు. దీనిపై కార్పొరేటర్లు డివిజన్ల వారీ పౌరులను చైతన్యవంతం చేయాలని తెలిపారు.  
ఐయామ్‌ తెలంగానైట్‌.. కవి, అనువాదకుడు డాక్టర్‌ మంతెన దామోదరాచారి  తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన ‘ఐయామ్‌ తెలంగానైట్‌’ పుస్తకాన్ని శుక్రవారం మేయర్‌కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని