logo

ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ మెలిక

పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన టీఎస్‌ఆర్టీసీ.. అందుకు నిబంధనలు వర్తిస్తాయంటూ మెలిక పెట్టింది.

Published : 02 Apr 2023 03:19 IST

పాస్‌ ఉంటేనే పది విద్యార్థులకు అనుమతి

కంటోన్మెంట్‌ మడ్‌ఫోర్డ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన టీఎస్‌ఆర్టీసీ.. అందుకు నిబంధనలు వర్తిస్తాయంటూ మెలిక పెట్టింది. గతంలో కేవలం హాల్‌టిక్కెట్‌ మాత్రమే చూపిస్తే సరిపోయేది.. ఈసారి హాల్‌టిక్కెట్‌తో పాటు.. ఉచిత లేదా రాయితీతో కూడుకున్న బస్‌పాస్‌, రూట్‌పాస్‌ ఇలా ఏదో ఒకటి చూపించాలని సూచించింది. బస్‌పాస్‌ లేకుంటే టిక్కెట్‌ తీసుకోవాల్సిందేనని పేర్కొంది. నగరవ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాలకు బస్సులను ఏర్పాటు చేసినట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని