రామకృష్ణ మిషన్ సేవలు మరువలేనివి : త్రిదండి చిన్నజీయర్ స్వామి
రామకృష్ణ మిషన్ (Rama krishna mission) స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ముగిశాయి.
హైదరాబాద్: రామకృష్ణ మిషన్ (Rama krishna mission) స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ముగిశాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో భిన్నత్వంలో ఏకత్వం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద అధ్యక్షత వహించిన ఈ సదస్సులో పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి (Chinna Jeeyar swamy) ప్రసంగించారు.
11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనం విశిష్టాద్వైతం గురించి చిన్నజీయర్ స్వామి వివరించారు. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడని ఈ తత్వము ప్రతిపాదించిందని చెప్పారు. రామానుజాచార్యుడు ఆనాడే నిమ్నజాతులకు దేవాలయ ప్రవేశం చేయించి అందరినీ సమానంగా చూశారని చెప్పారు. రామకృష్ణ మిషన్ సేవలు మరువలేనివన్నారు. భారత సనాతన సంప్రదాయాలను, సంస్కృతిని అందరికీ తెలిసేలా చేశారని చెప్పారు. బేలూరు మఠాన్ని సందర్శించాలని ఉందని చిన్నజీయర్ స్వామి చెప్పారు.
కార్యక్రమంలో అద్వైత సిద్ధాంతం గురించి అమెరికా అర్ష విద్య గురుకులం ఉపాధ్యక్షులు స్వామి తత్వవిదానంద సరస్వతి, ద్వైత సిద్ధాంతం గురించి కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య వీరనారాయణ ఎన్.కే.పాండురంగి మాట్లాడారు. రామకృష్ణ వివేకానంద వేదాంత సంప్రదాయాల గురించి బేలూరు రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన స్వామి ఆత్మప్రియానంద మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సిబ్బంది, భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ