logo

From Software To IPS Officer: నాడు డెలాయిట్‌ ఉద్యోగి.. నేడు ఐపీఎస్‌

ఒకప్పుడు ఆ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత మానేసి ఐపీఎస్‌ అధికారి అయ్యారు.

Updated : 25 Aug 2023 07:38 IST

డీసీపీ హర్షవర్ధన్‌ మాజీ ఉద్యోగుల ఆనందం

సంస్థ కార్యాలయంలో మాట్లాడుతున్న హర్షవర్ధన్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఒకప్పుడు ఆ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత మానేసి ఐపీఎస్‌ అధికారి అయ్యారు. తాను పనిచేసిన సంస్థ కార్యాలయానికే ముఖ్యఅతిథిగా వచ్చారు.. తోటి ఉద్యోగి ఐపీఎస్‌ అధికారిగా ప్రత్యక్షమవడంతో ఆయన్ను చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందంలో మునిగారు. ఉత్సాహంగా ఘన స్వాగతం పలికారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో గురువారం గచ్చిబౌలిలోని డెలాయిట్‌ సంస్థ కార్యాలయంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2018 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన డీసీపీ (ట్రాఫిక్‌-1) హర్షవర్ధన్‌ హాజరయ్యారు. గతంలో ఆయన అదే సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. పాత జ్ఞాపకాలను ఉద్యోగులు నెమరేసుకున్నారు. హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ నిర్వహణలో ఐటీ పరిశ్రమ సహకారం అందిస్తోందన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ట్రాఫిక్‌ వాలంటీర్లుగా సేవలందిస్తూ ఐటీ క్షేత్రాలను సురక్షిత ట్రాఫిక్‌ జోన్‌లుగా నిలపడంలో కీలకంగా నిలుస్తున్నారని కొనియాడారు. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ రణ్‌వీర్‌రెడ్డి, ట్రాఫిక్‌ శిక్షణ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు, టిమ్స్‌, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని