logo

నాడు.. నేడు.. సాగరే ఆధారం

నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌ వద్ద అత్యవసర పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం షురూ చేసింది.

Published : 17 Apr 2024 02:37 IST

2017 నాటి పరిస్థితి పునరావృతం
ఒకట్రెండు రోజుల్లో అత్యవసర పంపింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌ వద్ద అత్యవసర పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం షురూ చేసింది. ప్రస్తుతం పుట్టంగండి పంపింగ్‌స్టేషన్‌కు అప్రోచ్‌ ఛానెల్‌ ద్వారా పుష్కలంగా నీళ్లు అందుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో పంపింగ్‌ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నాగార్జున్‌సాగర్‌లో 509.10 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. 508 అడుగులు కంటే తగ్గితే వెంటనే అత్యవసర పంపింగ్‌ చేయనున్నారు. 2017లో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాగా.. సెప్టెంబరు వరకు అత్యవసర పంపింగ్‌ నడిపించారు. ప్రస్తుతం పుట్టంగండి వద్ద నిర్మించిన అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి తొలుత సాగర్‌ నీళ్లను ఎత్తి పోయనున్నారు. ఇక్కడి నుంచి కిందకు ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్‌లోకి నీటిని విడిచిపెడతారు. కోదండాపూర్‌ వద్ద నుంచి భారీ పైపులైన్లతో జలమండలి నీటిని సేకరించి శుద్ధి చేసి అక్కడ నుంచి నగరానికి తరలిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని