logo

పేటకు తొలి మహిళా ఎమ్మెల్యే

నారాయణపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. నియోజకవర్గంలోని అయిదు మండలాలలో 2,31,896 మంది ఓటర్లు ఉండగా 1,81,708 మంది ఓట్లు వేశారు.  ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి చిట్టెం పర్నిక రెడ్డి 84,005 ఓట్లు సాధించారు.

Published : 04 Dec 2023 05:04 IST

20 రౌండ్లలో పర్నికదే అధిక్యం

ధన్వాడలో మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి సమాధివద్ద నివాళి అర్పిస్తున్న పర్నిక రెడ్డి

న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం: నారాయణపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. నియోజకవర్గంలోని అయిదు మండలాలలో 2,31,896 మంది ఓటర్లు ఉండగా 1,81,708 మంది ఓట్లు వేశారు.  ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి చిట్టెం పర్నిక రెడ్డి 84,005 ఓట్లు సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ 1258 ఓట్లకు 700 కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చాయి.  భారాస అభ్యర్థి ఎస్‌.రాజేందర్‌రెడ్డికి 76,499 ఓట్లురాగా బ్యాలెట్‌ ఓట్లు 256 వచ్చాయి.  భాజపా అభ్యర్థి రతంగ్‌ పాండురెడ్డికి 14,869 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌లో 206 ఓట్లు వచ్చాయి.

మొత్తంగా పర్నికకు 84,705 ఓట్లురాగా, రాజేందర్‌ రెడ్డికి 76,755 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి రతంగ పాండు రెడ్డికి మొత్తం ఓట్లు 15,075 ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్‌ అభ్యర్థి పర్నిక రెడ్డి ప్రతిరౌండ్‌లో అధిక్యంతో సాగారు. మొదటి రౌండ్‌లో 421, రెండో రౌండ్‌లో 1115, మూడో రౌండ్‌లో 2974,  నాలుగో రౌండ్‌ నుంచి 3 వేలకు పైగా అధిక్యంతో ముందజలో ఉన్నారు. 9వ రౌండ్‌లో 7,4920 అధిక్యం, 20వ రౌండ్‌లో 7,506 ఓట్లతో అధిక్యత సాధించారు.  గెలిచిన తర్వాత పర్నిక రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు సింగారం స్టేజి నుంచి కౌంటింగ్‌ కేంద్రం ప్రధాన గేటు వరకు బారులు తీరారు.  బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని