2 కోట్లకు చేరువలో కరోనా టెస్టులు..!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను భారత ప్రభుత్వం పెంచింది. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 4నుంచి 5లక్షల శాంపిళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Published : 02 Aug 2020 11:37 IST

24 గంటల్లో 4లక్షల 63వేల శాంపిళ్ల పరీక్ష

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను భారత ప్రభుత్వం పెంచింది. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 4నుంచి 5లక్షల శాంపిళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే 4,63,172 శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కోటీ 98లక్షల (1,98,21,831) శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

ఇక ప్రపంచంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 5కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అధిక టెస్టులు చేస్తోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ట్రంప్‌ ఇదివరకే స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..
భారత్‌లో 17లక్షల దాటిన కరోనా కేసులు
గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని