Prakash Raj: చంద్రయాన్‌పై ప్రకాశ్‌ రాజ్‌ పోస్ట్‌.. నెటిజన్ల ఫైర్‌!

Prakash Raj slammed for his post: చంద్రయాన్‌పై ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అవమానించారంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

Published : 21 Aug 2023 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రాజెక్ట్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పోస్ట్‌ (Prakash Raj) చేసిన ఓ చిత్రం విమర్శలకు తావిచ్చింది. రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేసే క్రమంలో ఇస్రో సైంటిస్టులను అవమానించడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అధికార భాజపాపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంటారు ప్రకాశ్‌ రాజ్‌. పలు సందర్భాల్లో ప్రధాని మోదీపైనా ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘బ్రేకింగ్‌ న్యూస్‌.. విక్రమ్‌ ల్యాండర్‌ పంపిన తొలి ఫొటో’ అంటూ అందులో పేర్కొన్నారు. అయితే, తన పోస్టులో ప్రకాశ్‌ రాజ్‌ ఎక్కడా ప్రధాని మోదీ పేరు ప్రస్తావించనప్పటికీ.. ఇది ఆయననుద్దేశించి చేసిన పోస్టేనంటూ కొందరు నెటిజన్లు ఆరోపించారు. దీంతో రాజకీయాల కోసం శాస్త్రవేత్తలను అవమానిస్తారా అంటూ కొందరు నెటిజన్లు విమర్శలకు దిగారు. 

‘మిత్రమా.. స్వాగతం!’.. చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌తో ల్యాండర్‌ అనుసంధానం

‘‘చంద్రయాన్‌- 3 అనేది దేశానికే గర్వకారణం. గుడ్డిగా కొందర్ని వ్యతిరేకించే క్రమంలో మీరు సైంటిస్టులనే అవమానిస్తున్నారు’’ అని ఓ నెటిజన్‌ కామెంట్ చేశారు. ‘చంద్రయాన్‌ ప్రాజెక్ట్‌ ఇస్రోకు సంబంధించింది. భాజపాది కాదు. విజయవంతమైతే అది భారత్‌ విజయం. ఏ ఒక్క పార్టీదో కాదు. మీ రాజకీయాల్లోకి ఇస్రోను లాగొద్దు’’ అని మరో నెటిజన్‌ విమర్శలు గుప్పించాడు. ‘దేశం కోసం ఏళ్లుగా కష్టపడుతున్న శాస్త్రవేత్తల మీద మీ విమర్శలు సరికాదు’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని