వారికి చెక్‌ పెట్టేందుకు మహిళా జవాన్ల పహారా!

మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందకు జమ్ముకశ్మీర్‌లోని​ గందర్బల్‌ జిల్లాలో అసోం రైఫిల్స్​కు చెందిన​ మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు....

Published : 04 Jul 2021 01:41 IST

గందర్బల్‌: మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు జమ్ముకశ్మీర్‌లోని​ గందర్బల్‌ జిల్లాలో అసోం రైఫిల్స్​కు చెందిన​ మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కల్నల్ కరకోటి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ బలగాలు పనిచేస్తారని కల్నల్‌ వెల్లడించారు.

ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మహిళలు అక్రమంగా చేరవేస్తున్నారనే సమాచారం మేరకు మహిళా జవాన్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద తమ సహచరులకు స్థానిక మహిళలు సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్​లోని కుప్వారా జిల్లాలో 2020 ఆగస్టులోనే మహిళా బలగాలను మోహరించారు. ప్రస్తుతం గందర్బల్‌ జిల్లాలో మహిళా బలగాలు.. మహిళలను తనిఖీలు చేస్తున్నాయి. పురుష సైనికుల మాదిరే మహిళా సైనికుల సేవలను వినియోగించుకుంటున్నట్లు కల్నల్ కరకోటి తెలిపారు. స్థానిక ప్రజలతో కలిసిపోయి వారిలో చైతన్యం కలిగించే దిశగా మహిళా సేనలు పనిచేస్తాయన్నారు. భద్రతా దళాలకు ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని