Agent OTT: అఖిల్‌ ‘ఏజెంట్‌’ స్ట్రీమింగ్‌ అయ్యే ఓటీటీ వేదిక ఇదే!

అఖిల్‌ (Akhil) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’(Agent).

Published : 29 Apr 2023 15:20 IST

హైదరాబాద్‌: అఖిల్‌ (Akhil) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’(Agent). శుక్రవారం విడుదలైన ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ‘ఏజెంట్‌’ కోసం అఖిల్‌ పడిన కష్టం, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్‌, ఓటీటీ రైట్స్‌ రూపంలో బాగానే బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. ఇక ‘ఏజెంట్‌’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక ‘సోనీలివ్‌’ దక్కించుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత సోనీలివ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

‘ఏజెంట్‌’లో అఖిల్‌ రిక్కీ అలియాస్‌ రామకృష్ణ అనే పాత్రలో నటించాడు. స్పై అవ్వడమే లక్ష్యంగా కష్టపడినా ప్రతిసారీ ఇంటర్వ్యూలో రిజెక్ట్‌ అవుతుంటాడు. ఈ క్రమంలో  ‘రా’ చీఫ్‌ డెవిల్‌ అలియాస్‌ మహదేవ్‌ (మమ్ముట్టి) మిషన్‌ రాబిట్‌ను అడ్డుకునేందుకు రిక్కీని రంగంలోకి దించుతాడు. మరి రిక్కీ ‘మిషన్‌ రాబిట్‌’ను ఎలా అడ్డుకున్నాడు?వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? ఈ కథలో కేంద్రమంత్రి జయకిషన్‌ (సంపత్‌ రాజ్‌) ఏంటి? అన్నది మిగతా కథ.

‘ఏజెంట్‌’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని