Chiranjeevi: మీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తి : చిరుకు సినీ ప్రముఖుల అభినందనలు

దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఎంపిక కావడంపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 26 Jan 2024 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi).. పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కావడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌(ట్విటర్‌)లో వరుస పోస్టులు పెట్టారు.

‘‘బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మవిభూషణ్‌ దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీ విషయంలో ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటా. కంగ్రాట్స్‌’’ - రాఘవేంద్రరావు

‘‘పునాది రాళ్లు’తో నటుడిగా తొలి అడుగు వేసిన ఒక సాధారణ కుర్రాడు.. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఇప్పుడు ఎంపికయ్యారు. మీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తి. పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు’’ - రాజమౌళి

Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్‌ చేసింది: పద్మ విభూషణ్‌ చిరంజీవి ప్రయాణమిది!

‘‘పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి. కంగ్రాట్స్‌ అన్నయ్య. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’’ - రవితేజ

‘‘డ్రీమ్‌ బిగ్‌’ అంటూ ఎన్నో తరాల్లో ప్రేరణ నింపారాయన. మంచి మనసు, గొప్ప లెగసీ కలిగిన చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది’’ - నాగవంశీ

‘‘పద్మవిభూషణ్‌ అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేశారనే అద్భుతమైన వార్తతో నిద్ర లేచా. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే క్షణాలు ఇవి. కంగ్రాట్స్‌ మెగాస్టార్ చిరంజీవి’’ - మంచు విష్ణు

‘‘నాకు బాగా నచ్చిన ఫొటో ఇదే. ఎల్లప్పుడూ నాపట్ల దయ, ఆప్యాయంగా ఉన్నందుకు.. మనసును హత్తుకునే ప్రదర్శనలతో అద్భుతమైన చిత్రాలను అందించినందుకు.. మా ‘మెగాస్టార్‌’గా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇకపై మీరు పద్మవిభూషణ్‌ చిరంజీవి’’ - అడివి శేష్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని