Indian 2: ‘ఇండియన్‌ 2’ కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ.. ఆసక్తి రేకెత్తిసోన్న శంకర్‌ పోస్ట్‌

కమల్‌ హాసన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని శంకర్‌ అభిమానులతో పంచుకున్నారు.

Published : 23 Jul 2023 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతకు పెద్దపీట వేస్తూ సినిమాలు తెరకెక్కించడంలో కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ (Shankar) ముందుంటారు. తన ఆలోచనలకు టెక్నాలజీ జోడించి, ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంటారు. కెరీర్‌ ప్రారంభంలో ఓ పాటలోనో, ఏదైనా సన్నివేశంలోనో గ్రాఫిక్స్‌ని చూపించి మైమరపించిన ఆయన ‘రోబో’, ‘2.ఓ’ వంటి సినిమాలని విజువల్స్‌ ప్రధానంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2) (Indian 2)కోసం ఆయన మరో అడుగు ముందుకేశారు. ఈ సినిమా కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ సంస్థ లోలా (Lola VFX) ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ అందించనుంది. ఇదే విషయాన్ని చెబుతూ సంబంధిత స్టూడియోలో దిగిన ఫొటోని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు శంకర్‌. అందులో ఆయన అక్కడ జరిగే పనిని తదేకంగా చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇండియన్‌ 2’ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంబోతోదంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ఈ సంస్థ ‘అవెంజర్స్‌’, ‘కెప్టెన్‌ మార్వెల్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘అవతార్‌’ తదితర హాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు విజువల్స్‌ అందించింది.

ఈ మార్పులు చేయండి.. అలియా-రణ్‌వీర్‌ చిత్రబృందానికి సెన్సార్‌ సూచన

శంకర్‌- హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్‌’ (భారతీయుడు). ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నదే ‘ఇండియన్‌ 2’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతోపాటు శంకర్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు