Devara: దేవర.. మరోసారి ఆ హిట్‌ ఫార్ములాతో వస్తున్నారా?

‘దేవర’ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

Published : 12 Feb 2024 12:55 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌(NTR), దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’(Devara). ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాకి  సంబంధించి ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని రూపొందించి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు కొరటాల శివ. అదే కాన్సెప్ట్‌తో ఎన్టీఆర్‌ ‘దేవర’ తీర్చిదిద్దుతున్నారని టాక్‌.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ను విడుదల చేశారు. దీనికి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రంలో తండ్రి పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

‘దేవర’(Devara) సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. తొలుత ఈ మూవీని ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మరింత ఆలస్యం కానుండటంతో సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త తేదీ విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని