Anushka: ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ టీమ్ కీలక నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో మహిళల కోసం ప్రత్యేక షో..

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన సినిమా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ చిత్రబృందం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 12 Sep 2023 15:59 IST

హైదరాబాద్‌: నవీన్‌ పొలిశెట్టి, అనుష్కల  (Anushka) తాజా బ్లాక్ బస్టర్‌ ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది. తాజాగా ఈ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

మహిళల కోసం గురువారం (సెప్టెంబర్‌ 14) ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు తెలిపింది. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లను ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ అనుష్క కూడా ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’పై ఎంతో ప్రేమ చూపుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చేసిన ట్వీట్స్‌, మెసేజ్‌లు అన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ గురువారం కొన్ని థియేటర్లలో మహిళల కోసం మాత్రమే ఈ సినిమాను ప్రదర్శించనున్నాం. దీనికి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను, చిన్న పిల్లలను కూడా తీసుకురండి. మరొకసారి మీరందరికీ కృతజ్ఞతలు’ అని అనుష్క చెప్పారు. 

ఆయన్ని నిందించకండి.. ఏ.ఆర్‌.రెహమాన్‌ కోసం సెలబ్రెటీల ట్వీట్స్‌

పి.మహేష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై చిరంజీవి మొదలుకొని ఎంతో మంది సినీ తారలు ట్వీట్‌ చేశారు. అటు విదేశాల్లోనూ ఈ చిత్రం కాసులు కురిపిస్తోంది. సినిమా షూటింగ్‌ పూర్తవ్వగానే హీరో నవీన్‌ పొలిశెట్టి అమెరికాలోనూ వరుస ప్రమోషన్లు ఇచ్చి సందడి చేశారు. దీంతో విడుదలైన నాలుగు రోజులకే ఈ చిత్రం అక్కడ వన్‌ మిలియన్‌ డాలర్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక నవీన్‌ పొలిశెట్టి గతంలో నటించిన ‘జాతిరత్నాలు’ కూడా అమెరికాలో వన్‌ మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని