Nandini Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ - సమంత ఒక్కటే: నందినిరెడ్డి
దర్శకురాలు నందినిరెడ్డి (Nandini Reddy) తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). వచ్చే గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి నందిని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హైదరాబాద్: సంతోశ్ శోభన్ (Santosh Sobhan)- మాళవికా నాయర్ (Malvika Nair) జంటగా నటించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). నందిని రెడ్డి దర్శకురాలు. వేసవి కానుకగా మే 18న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నందినిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
‘‘ఈ కథను నేను ఎప్పుడో రాసుకున్నాను. విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా. తను కూడా ఆసక్తి చూపించాడు. ఆ తర్వాత విజయ్ ఇమేజ్ మారింది. ఇలాంటి సాఫ్ట్ రోల్ అతడికి కరెక్ట్ కాదని నిర్మాత స్వప్న దత్ నేనూ ఫీలయ్యాం. అదే విషయాన్ని అతడికి చెప్పాం. ఈ క్రమంలోనే నేను ‘ఓ బేబీ’ ప్రాజెక్ట్ చేశాను. అది అయ్యాక రెండేళ్లు కొవిడ్ లాక్‌డౌన్‌లో ఉండిపోయాం. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి నటీనటుల కోసం వెతుకుతున్నప్పుడు స్వప్న సడెన్‌గా సంతోశ్ పేరు చెప్పింది. స్క్రీన్ టెస్ట్ చేశాం. అతడు ఈ రోల్‌కు సరిగ్గా సెట్ అయ్యాడు. సంతోష్ మాత్రమే కాదు.. ఈసినిమాలో ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలకు కరెక్ట్‌గా సెట్ అయ్యారు’’
‘‘నా తదుపరి ప్రాజెక్ట్ సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్నా. సిద్ధు నాకు ‘అలా మొదలైంది’ టైమ్ నుంచి తెలుసు. మూడు నెలల క్రితమే మా సినిమా ఓకే అయ్యింది. మా ఇద్దరి కాంబో MAD రోలర్ కోస్టర్ రైడర్‌లా ఉంటుంది.’’
‘‘అల్లు అర్జున్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. నేను రాసే కథలను బన్నీకి షేర్ చేస్తుంటాను. ఎప్పటి నుంచో అతడితో సినిమా చేయాలని ఉంది. కానీ కుదరలేదు. ఇప్పుడు బన్నీ పెద్ద స్టార్ అయ్యారు. ఆయన ఇమేజ్‌కు తగ్గట్టు మంచి కథ ఉంటే తప్పకుండా చేస్తాను. ఇక, సమంత నాకు మంచి మిత్రురాలు. సామ్‌కు ఏదీ అంత ఈజీగా రాలేదు. ఆమె ఎంత కష్టపడుతుందో నాకు బాగా తెలుసు. హార్డ్‌వర్క్ విషయంలో సామ్-బన్నీ ఒక్కటే. కష్టపడటం వల్లే వాళ్లిద్దరూ ఈ స్థాయికి రాగలిగారు. లక్ వల్ల కాదు’’ అని నందినిరెడ్డి వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM