Naveen Polishetty: అభిమానికి బిర్యానీ తినిపించిన నవీన్‌ పొలిశెట్టి.. ఆకర్షిస్తున్న వీడియో!

నవీన్‌ పొలిశెట్టి నటించిన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి మిసర్ట్‌ పొలిశెట్టి’ సెప్టెంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు నగరాలు తిరుగుతూ నవీన్‌ సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు.

Published : 28 Aug 2023 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యూత్‌లో క్రేజ్‌ ఉన్న నటుల్లో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ఒకరు. ఆయన తెరపై ఎంతగా సందడి చేస్తారో తెర వెనుకా అదే స్థాయిలో నవ్వులు పంచుతుంటారు. తన కొత్త చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ప్రచారంలో భాగంగా కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలను సందర్శిస్తున్నారు. అక్కడి మాల్స్‌, కాలేజ్‌లకు వెళ్లి అభిమానులను కలుసుకుని ముచ్చటిస్తున్నారు. తనదైన శైలి కామెడీతో వారిని కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆ క్రమంలోనే ఆదివారం.. విజయవాడ, గుంటూరులో పర్యటించారు. ఇప్పటి వరకు చేసిన వాటిలో విజయవాడ టూర్‌ తనకు బాగా నచ్చిందని తెలియజేస్తూ అక్కడి దృశ్యాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. నెట్టింట ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం.. నవీన్‌ తన అభిమానికి కుండ బిర్యానీ తినిపించడం. విజయవాడలోని ఓ స్ట్రీట్‌లో కారుపై కూర్చొని ఆయన బిర్యానీ తింటుండగా చాలామంది అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అక్కడున్న వారిని తోసుకుంటూ ముందుకొచ్చిన ఓ అభిమానికి నవీన్‌ తాను తింటున్న బిర్యానీ తినిపించారు. అనంతరం, బిర్యానీతో కూడిన కుండను చేతికందించారు. ‘సింప్లిసిటీ అంటే ఇదీ’, ‘మా బెజవాడ ఎలా ఉంది?’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇంటిపేరు పాడుచేస్తున్నా అని తిట్టారు

పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్‌ సరసన అనుష్క శెట్టి (Anushka Shetty) నటించారు. ఇందులో హీరో స్టాండప్‌ కమెడియన్‌గా, హీరోయిన్‌ చెఫ్‌గా కనిపించనున్నారు. అభినవ్‌ గోమటం, మురళీశర్మ, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని