Kamal Haasan: కమల్‌ సరసన నయనతార.. టీజర్‌ అప్పుడేనా!

కమల్ హాసన్‌ హీరోగా మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నయనతారను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించగా అటు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం.

Published : 23 Oct 2023 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మణిరత్నం-కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులైంది. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో షేర్‌ అవుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్‌ను ఎంపిక చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నయనతారను (Nayanthara) ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. అయితే, అది ఐశ్వర్య రాయ్‌ కోసం అనుకున్న పాత్రనా లేదంటే మరొకటా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చిత్రబృందం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఈ  వార్త మాత్రం నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో అతిథిపాత్ర కోసం రజనీకాంత్‌తో మూవీ టీమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ‘త్రిష’ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా (#KH234) టీజర్‌ను నవంబర్‌ 7న విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే టీజర్‌ కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు  వార్తలు వస్తున్నాయి. రోజువారీ షూటింగ్‌ను జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

‘లియో’ మిశ్రమ స్పందనలు.. లోకేశ్‌ కనగరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఇక కమల్‌ హాసన్‌-మణిరత్నంల కాంబినేషన్‌లో 35 ఏళ్ల తర్వాత రానున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గతంలో వీరి కాంబోలో ‘నాయకన్‌’ సినిమా తెరకెక్కి ఘన విజయాన్ని అందుకుంది. మణిరత్నం, కమల్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ‘విక్రమ్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్న కమల్‌ హాసన్ త్వరలోనే ‘ఇండియన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు