NTR: ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియాంకా చోప్రా..? ఆసక్తికరంగా ప్రాజెక్ట్ వివరాలు
ఎన్టీఆర్ (NTR) కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్‌గా ఇది సిద్ధం కానుంది. కాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం తారక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) నటించనున్నారని సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇండియా - పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే కథతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధం కానుందట, మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో చూడొచ్చని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ మొదలు కానుంది.
ఇక, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలెక్కించనున్నారు. మరోవైపు, ప్రియాంక.. ఇటీవల ‘సిటడెల్’తో అలరించారు. త్వరలో దీనికి ప్రీక్వెల్ రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.