Rowdy Boys Trailer: ఎన్టీఆర్‌ విడుదల చేసిన ‘రౌడీ బాయ్స్‌’ ట్రైలర్‌ చూశారా?

కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథలతో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కోవలోనే వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రౌడీ బాయ్స్‌’.

Published : 08 Jan 2022 18:42 IST

హైదరాబాద్‌: కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథలతో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కోవలోనే వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రౌడీ బాయ్స్‌’. నిర్మాత  శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

రెండు కళాశాలలు... ఇంజినీరింగ్‌ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. కాలేజ్‌లో స్నేహితుల మధ్య చోటు చేసుకునే సరదా అల్లర్లు, తోటి విద్యార్థులతో గొడవలు, ప్రేమ ఇలా అన్ని అంశాలను మిళితం చేసి, సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని