Salman khan: ఆ సీన్‌ కష్టమైనా ఓ అద్భుతమే!

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన  ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాతో మొదలైన ఆ స్పై యాక్షన్‌ పరంపర బాలీవుడ్‌లో బాగానే పని చేసింది. టైగర్‌ ఫ్రాంఛైజీలో రానున్న ‘టైగర్‌ 3’ని మనీష్‌ శర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Updated : 11 Nov 2023 19:19 IST

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన  ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాతో మొదలైన ఆ స్పై యాక్షన్‌ పరంపర బాలీవుడ్‌లో బాగానే పని చేసింది. టైగర్‌ ఫ్రాంఛైజీలో రానున్న ‘టైగర్‌ 3’ని మనీష్‌ శర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో టైగర్‌, జోయాల ప్రేమ, ఇండియా కోసం రా ఏజెంట్‌ అయిన టైగర్‌ చేసే యాక్షన్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘టైగర్‌ 3’ నవంబరు 12న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సల్మాన్‌. ఆయన చెప్పిన ముచ్చట్లివి.

  • సినిమాలో కళ్లు చెదిరే యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా దర్శకుడు మనీష్‌ వాటిని ప్లాన్‌ చేశారు. సినిమాలోని అన్ని యాక్షన్‌ సన్నివేశాల కన్నా బైక్‌ ఛేజింగ్‌ సీన్‌ మాత్రం చాలా కష్టంగా అనిపించింది(నవ్వుతూ). చేసిన అన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ల కన్నా అది భారీ షాట్‌ అని నేను చెప్పగలను. దానిని ప్రేక్షకులు ఆస్వాదించాలంటే చిత్ర బృందానికి ఎంతో ప్లానింగ్‌ ఉండాలి. దాని కోసం ఎంతో మంది సహాయ సహకారాలందించారు. ఆ షాట్‌ అద్భుతం.
  • చిత్రీకరణ ఎంతో సరదాగా సాగింది. మరింత ఆనందం ఇచ్చిన భాగం మాత్రం టర్కీలో కెప్పడోసియాలో షూట్‌ చేసిన ‘లేకే ప్రభు కా నామ్‌’ పాట. కత్రినాతో కలిసి చేసిన చాలా పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఆ జాబితాలో ఈ పాట తప్పక చేరుతోంది. మంచి పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను కత్రినాతో కలిసి అలరిస్తున్నందుకు అదృష్టంగా ఫీల్‌ అవుతున్నాను.
  • ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందో ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ కూడా అంతకు మించి ఉంటుంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ యాక్షన్‌ ప్రియులకి ఆ సినిమాతో మంచి ట్రీట్‌ ఇవ్వనున్నారు. అందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ పనులు ప్రారంభమవుతాయి. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలైన ‘ఈ టైగర్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు’(నవ్వుతూ).
  • ‘టైగర్‌ 3’ చిత్రం కోసం సల్మాన్‌ అభిమానులే కాదు షారుక్‌, హృతిక్‌ రోషన్‌లు అతిథి పాత్రలో కనిపించనుండటంతో వారి ఫ్యాన్స్‌ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షారుక్‌, సల్మాన్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో ‘పఠాన్‌’ సినిమా చూపించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని