Samajavaragamana: ఓటీటీలోకి ‘సామజవరగమన’.. అనుకున్న టైమ్‌ కంటే ముందే వచ్చేసింది

‘సామజవరగమన’ సినిమా అనుకున్న సమయానికంటే ముందుగానే ఓటీటీలోకి రానుంది. ప్రేక్షకుల డిమాండ్‌ మేరకు అలా చేస్తున్నట్టు ఓటీటీ సంస్థ ‘ఆహా’ ప్రకటించింది.

Updated : 27 Jul 2023 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవిష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటించిన ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో ఇటీవల విడుదలై, ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ సినిమాని తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ నెల 28న రిలీజ్‌ చేస్తున్నట్టు ‘ఆహా’ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా తేదీని మార్చింది. ప్రేక్షకుల డిమాండ్‌ మేరకు గురువారం రాత్రి 7 గంటలకు సినిమాని స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్‌ (Reba Monica John) కథానాయికగా నటించింది. నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు (Samajavaragamana On AHA).

రివ్యూ: నాయకుడు.. తమిళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో మెప్పించిందా?

క‌థేంటంటే: బాలు (శ్రీవిష్ణు) ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. సంపాదించే ప్ర‌తి రూపాయిని జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టే స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం త‌న‌ది. తండ్రి ఉమా మహేశ్వ‌ర‌రావు (న‌రేశ్‌)ను డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్ప‌లు ప‌డుతుంటాడు. ఎందుకంటే ఆయ‌న డిగ్రీ పూర్తి చేస్తేనే త‌న తాత వీలునామా ప్ర‌కారం కోట్ల రూపాయ‌ల ఆస్తి చేతికొస్తుంది. ఆయ‌న డిగ్రీ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసే క్ర‌మంలో స‌ర‌యు (రెబా మోనికా జాన్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఆమె పేయింగ్ గెస్ట్‌గా బాలు ఇంట్లోకి అడుగు పెడుతుంది. ‘ఐ ల‌వ్ యూ’ అంటే చాలు ఆ చెప్పిన అమ్మాయితో బ‌ల‌వంతంగా రాఖీ క‌ట్టించుకునే బాలు, స‌ర‌యుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డానికి ఓ ప్ర‌ణాళిక కూడా ర‌చిస్తారు. అయితే త‌న‌ బావ పెళ్లి బాలుకు ఓ విచిత్ర‌మైన స‌మ‌స్య తెచ్చిపెడుతుంది. మ‌రి ఆ స‌మ‌స్య ఏంటి? త‌న‌ బావ పెళ్లికి.. బాలు- స‌ర‌యు ప్రేమ‌క‌థ‌కు ఉన్న లింకేంటి? అస‌లు స‌ర‌యు కుటుంబ నేప‌థ్య‌మేంటి? వీళ్ల ప్రేమ క‌థ చివ‌ర‌కు ఏమైంది? బాలు తండ్రి డిగ్రీ పాసై త‌న ఆస్తి ద‌క్కించుకున్నాడా? లేదా? అన్న‌వి తెర‌పై చూసి తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని