Chiranjeevi: గుర్తుందిగా.. నా పేరు శివ శంకర వర ప్రసాద్: చిరంజీవి
చిరంజీవి, ఉపాసన.. వీళ్లిద్దరిలో చరణ్ ఎక్కువగా ఎవరికి భయపడతారో తెలుసా?, చిరంజీవికి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా?.. ఇలాంటి ఎన్నో సరదా ప్రశ్నలకు వేదికైంది ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్....
మెగా, పవర్స్టార్స్ కుటుంబంలో భాగం కావడం అదృష్టం: చరణ్
హైదరాబాద్: చిరంజీవి, ఉపాసన.. వీళ్లిద్దరిలో చరణ్ ఎక్కువగా ఎవరికి భయపడతారో తెలుసా?.. చిరంజీవికి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా?.. ఇలాంటి ఎన్నో సరదా ప్రశ్నలకు వేదికైంది ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా చిరంజీవి, చరణ్, చిత్ర దర్శకుడు కొరటాల శివను సుమ కొన్ని సరదా ప్రశ్నలు అడిగారు.
సుమ: మీ అమ్మగారి చేతి వంట బెస్టా? లేదా మీ సతీమణి సురేఖ చేతి వంట బెస్టా?
చిరంజీవి: నూటికి నూరు శాతం అమ్మే. అమ్మ ప్రేమ, అమ్మ చేతి వంట, గుండెలకు హత్తుకుని ఆమె చూపించే ప్రేమాభిమానం.. దానికి మించిన తీపిదనం, కమ్మదనం ఎక్కడైనా ఉంటుందా..! (మధ్యలో సుమ అందుకుని.. సురేఖ గారు ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనల్‌గా అత్తగార్లకే మార్కులు వెళతాయి) (నవ్వులు)
సుమ: పవన్‌కల్యాణ్ లేదా చిరంజీవి.. వీళ్లిద్దరిలో ఎవరు మీకు ఆచార్య?
రామ్‌చరణ్: మొదట ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని చెప్పిన వారిని ఒక్కసారి ఇటు రమ్మని చెప్పండి (నవ్వులు). ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఆచార్యుల నుంచి వాతలు పడతాయి.. కాబట్టి వద్దు.
చిరంజీవి: చరణ్ తరఫున ఈ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. చరణ్.. నా నుంచి క్రమశిక్షణ.. వాళ్ల బాబాయ్‌ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు.
సుమ: నిర్మాత చరణ్ లేదా యాక్టర్ చరణ్.. ఎవరితో వర్క్ చేయడానికి మీరు సౌకర్యవంతంగా ఫీలయ్యారు?
రామ్‌చరణ్: నేను ఈ చిత్రాన్ని నిర్మించలేదండి. కొణిదెల ప్రొడెక్షన్ పేరు వేశాం కానీ.. కర్త, కర్మ అన్నీ నిరంజన్ రెడ్డినే. సెట్లోకి నటుడిగానే వెళ్లాను. ప్రొడ్యూసర్‌గా వెళ్లలేదు.
కొరటాల శివ: నాకెప్పుడూ యాక్టర్ చరణ్‌తోనే సౌకర్యంగా ఉంటుంది.
సుమ: చిరంజీవి, చరణ్ వీళ్లిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?
రామ్‌చరణ్: చిరంజీవి
చిరంజీవి: నా పేరు శివ శంకర వరప్రసాద్. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. శివుడు ముందు ఎంతోమంది డ్యాన్స్‌లు వేస్తారు. దాన్నే డ్యాన్స్ అని ఫీలవుతుంటారు. అది ఎవరైనా సరే.. శివుడి తర్వాతే. ఆయన తాండవం తర్వాతే.
కొరటాల శివ: ఈ శివుడిది కూడా అదే సమాధానం.
చిరంజీవి: ఎదుటివాళ్లని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేనే కావాలని తగ్గి.. వాళ్లకు అవకాశం ఇస్తుంటాను.
కొరటాల శివ: ‘భలే భంజారా’ సాంగ్ షూటింగ్ అప్పుడు.. ఫస్ట్ లైవ్‌లో చిరంజీవి డ్యాన్స్‌నే చూశాను. ఆ తర్వాతే చరణ్‌ని చూశాం.
సుమ: ఒక సినిమాకి డైరెక్టర్ లేదా యాక్టర్.. ఎవరు ఎక్కువ?
చిరంజీవి: దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడి వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చేరువ కావాలంటే దానికి దర్శకుడే మూలం.
సుమ: వీళ్లిద్దరిలో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు? ఉపాసన? లేదా నాన్న?
రామ్‌చరణ్: అది తెలియదు కానీ.. ఇంట్లో వాళ్లందరికీ మా అమ్మే బాస్. అమ్మ ముందు నాన్న చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే నేనూ నేర్చుకున్నా. ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను.
చిరంజీవి: అది నన్ను చూసి నేర్చుకున్నావా.. అయితే సుఖ పడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు
సుమ: ఈ రెండు జంటల్లో మీకు ఏ జోడీ అంటే ఎక్కువ ఇష్టం? చిరు-చరణ్? ఆచార్య-సిద్ధ?
కొరటాల శివ: నాకు ఆచార్య-సిద్ధ అంటే ఇష్టం.
సుమ: శివ రాసిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఆచార్య? లేదా సిద్ధ?
చిరంజీవి: ఈ రెండింటినీ ఓపెన్‌గా పెట్టి నన్ను చేయమంటే నేను సిద్ధ ఎంచుకుంటాను. సిద్ధ క్యారెక్టర్లో అన్ని వెరియేషన్స్ ఉన్నాయి. (ఆ తర్వాత మధ్యలో చిరు ఆగిపోయి.. తనకు తానే చెప్పొద్దు ఆపేయ్ అని చెప్పుకోవడంతో అక్కడే ఉన్న రాజమౌళి నవ్వులు పూయించారు.)
సుమ: మిమ్మల్ని ఎక్కువగా ఒత్తిడికి గురి చేసింది ఏమిటి? కరోనా వల్ల ఆలస్యం కావడమా? లేదా చిరు లీక్సా?
కొరటాల శివ: చిరంజీవి లీక్ చేస్తే బాగుండనేది నా భావన. ఆయన లీక్ చేయడం వల్ల దాని రీచ్ ఎక్కువగా ఉంటుంది. అది సరదాగా ఉన్నప్పటికీ సెన్సేషన్ అవుతుంది.
చిరంజీవి: నేను లీక్ చేయడం కాదు. ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. వాళ్లకు ఖర్చు లేకుండా నా నోటి ద్వారా చెప్పించాలనే ఇలా చేస్తున్నారు.
సుమ: మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏమిటి? నాటు కోడి? చేపల పులుసు?
చిరంజీవి: చేపల పులుసు
సుమ: సన్ ఆఫ్ మెగాస్టార్, మెగా పవర్‌స్టార్.. వీటిలో దేనికి మీరు ఎక్కువగా గర్వపడుతుంటారు?
రామ్‌చరణ్: మెగాస్టార్, పవర్‌స్టార్ ఉన్న కుటుంబంలో నేనూ ఉండటం నేనెంతో గర్వంగా ఫీలవుతుంటాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్‌లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా?