Sudigali Sudheer: ‘గాలోడు’ టీజర్‌ వచ్చేసింది..!

బుల్లితెరలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలతో కమెడియన్‌గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు సుడిగాలి సుధీర్‌. బుల్లితెర ప్రేక్షకుల్లో మాంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న సుధీర్‌ వెండితెరపై హిట్‌ అందుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాడు...

Published : 31 Dec 2021 11:20 IST

హైదరాబాద్‌: బుల్లితెరలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలతో కమెడియన్‌గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు సుడిగాలి సుధీర్‌. వెండితెరపై హిట్‌ అందుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాడు. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘3 మంకీస్‌’ చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ అనుకున్న పేరు రాలేదు. దీంతో ఆయన ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. సుధీర్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గాలోడు’.

రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. శుక్రవారం ఉదయం ‘గాలోడు’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ‘‘అదృష్టాన్ని నమ్ముకున్న వారు కష్టాలపాలు అవుతారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అదృష్టవంతులవుతారు. నేను రెండింటినీ నమ్ముకోను. నన్ను నేను నమ్ముకుంటా’’ అంటూ సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో సాగిన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఫైట్‌ సీక్వెన్స్‌లు మెప్పించేలా సాగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని