PUSHPA: ‘పుష్ప’ విలన్‌ వచ్చేశాడు.. ఫహద్‌ లుక్‌ ఇదే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో...

Updated : 07 Dec 2022 20:19 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇటీవల ఆయన ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. శనివారం ఉదయం ఫహద్‌ లుక్‌ను చిత్రబృందం నెటిజన్లకు పరిచయం చేసింది. ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని