Unstoppable: అందుకే బాలకృష్ణతో సినిమా చేయాలంటే భయం: రాజమౌళి
సినిమా తీసేటప్పుడు తాను హీరో కష్ట సుఖాల గురించి ఆలోచించనని అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) అన్నారు.
హైదరాబాద్: సినిమా తీసేటప్పుడు తాను హీరో కష్ట సుఖాల గురించి ఆలోచించనని అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) అన్నారు. ఒకవేళ బాలకృష్ణతో సినిమా చేస్తుంటే తన వ్యవహారశైలి వల్ల ఆయనకు ఏమైనా కోపం వస్తుందేమోనన్న భయంతోనే సినిమా చేయడానికి ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే(Unstoppable With NBK). తాజాగా షోకు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విచ్చేసి సందడి చేశారు.
ఈ సందర్భంగా ‘‘ఇప్పటివరకూ మన కాంబినేషన్ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని ‘బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని అడిగితే ‘బాలకృష్ణను నేను హ్యాండిల్ చేయలేను’ అన్నారట ఎందుకు’’ అని ప్రశ్నించగా ‘‘భయంతోనే అలా అన్నాను. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు ఎవరైనా ‘గుడ్ మార్నింగ్’ చెబితే చిరాకు. షాట్ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడను. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకూ హీరో కష్ట సుఖాలు ఆలోచించలేను. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే, మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం. నాకు అదే టెన్షన్’’ అని సమాధానం ఇచ్చారు. వెంటనే అందుకున్న బాలకృష్ణ ‘‘నేను ఒకసారి క్యారావ్యాన్లోని నుంచి బయటకు వస్తే, ఆ రోజు షూటింగ్ అయ్యే వరకూ లోపలకి వెళ్లను గొడుగు పట్టనివ్వను’’ అని చెప్పుకొచ్చారు.
ఇక మీరు సినిమా చేయడానికి రెండు మూడేళ్లు ఎందుకు పడుతోంది? అని ప్రశ్నించగా, ‘‘నేను మైండ్‌లో అనుకున్న విధంగా వస్తుందా? లేదా? అని రోజూ భయపడుతూ ఉంటా. అందుకే ఒకటికి, రెండుసార్లు ప్రతిదీ చెక్ చేసుకుంటా. ఎందుకంటే సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడికి పూర్తి వినోదం అందించాలి’’ అని జక్కన్న సమాధానం ఇచ్చారు.
‘స్టూడెంట్ నెం.1’ కంటే ముందు నన్ను కలిశారా?నాకు ఒక కథ చెప్పారనుకుంటా. అదే ఆ తర్వాత రామ్‌చరణ్‌తో తీశారా? అని అడగ్గా, ‘నాన్నగారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు రెండుమూడుసార్లు కలిశా. ఆ తర్వాత ‘ఛత్రపతి’ సమయంలో ‘మగధీర’ కథ చెప్పాను’’ అని రాజమౌళి తెలిపారు. ఇక ‘మీతో సినిమా చేస్తే, హీరోకు, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు. కానీ, ఆ హీరో తర్వాతి రెండు, మూడు సినిమాలు ఫసక్ అట కదా’ అని అనగా, ‘నాకు ఎటువంటి సంబంధం లేదు. నా సినిమా వరకూ నేను బాధ్యతతో ఉంటా’ అంటూ రాజమౌళి నవ్వేశారు. తనకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఉండేదని, ఎప్పటికైనా ‘బెన్హర్’లాంటి చేయాలన్న ఆలోచనతో ఉండేవాడినని రాజమౌళి చెప్పుకొచ్చారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్‌కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM