Leo: విజయ్‌ అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో విధ్వంసం

విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లియో’ (Leo). తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేయగా అభిమానులు ఓ థియేటర్లో అత్యుత్సాహం ప్రదర్శించారు.

Updated : 06 Oct 2023 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) నటించిన ‘లియో’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా అభిమానులు అత్యుత్సాహంతో ఓ థియేటర్లో బీభత్సం సృష్టించారు. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. అయితే, దానికి మిశ్రమ స్పందన రావడంతో ఫ్యాన్స్‌ అసహనానికి గురయ్యారు. దీంతో థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj) దర్శకత్వంలో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ‘లియో’ (Leo) తెరకెక్కుతోంది. ఈ సినిమాపై విజయ్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వాటిని అందుకోలేకపోయిందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో నిరాశకు గురైన కొందరు అభిమానులు థియేటర్లో విధ్వంసం సృష్టించారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం థియేటర్‌ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్‌ను ప్రదర్శించలేదని అందుకే అభిమానులకు ఆగ్రహం వచ్చి ఇలా చేశారని అంటున్నారు. ఈ ఘటన చెన్నైలోని రోహిణి థియేటర్లో జరిగినట్లు తెలుస్తోంది. 

‘ది వ్యాక్సిన్‌ వార్‌’పై మోదీ ప్రశంసలు.. దర్శకుడి ట్వీట్‌..

చిన్మయి ట్వీట్‌.. త్రిష రిప్లై..

ఇక ‘లియోలో విజయ్‌ సరసన త్రిష నటిస్తోంది. ఆమెకు ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi) డబ్బింగ్‌ చెప్పారు. ఈ విషయంపై చిత్రబృందానికి ధన్యవాదాలు తెలుపుతూ చిన్మయి ట్వీట్‌ చేయగా దానికి త్రిష రిప్లై ఇచ్చారు. 5 ఏళ్ల క్రితం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన డబ్బింగ్‌ యూనివర్సిటీ చిన్మయిపై కొన్ని కారణాల వల్ల నిషేధం విధించింది. ఆ నిషేధం తర్వాత ఆమెకు మొదటి సారి అవకాశం ఇచ్చినందుకు ‘లియో’ చిత్రబృందానికి చిన్మయి కృతజ్ఞతలు తెలిపింది. ‘అన్ని భాషల్లో ‘లియో’లో త్రిష వాయిస్‌కు నేను డబ్బింగ్‌ చెప్పాను. ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ చిన్మయి ట్వీట్‌ చేసింది. దీనికి త్రిష (Trisha) స్పందిస్తూ ఆమెకు థ్యాంక్స్‌ చెప్పింది.

గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు