ఒళ్లు గగుర్పొడిచేలా ‘జాంబిరెడ్డి’ మేకింగ్‌ వీడియో

‘అ!’, ‘కల్కీ’ వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ. ఈసారి మరో అడుగు ముందుకేసి మరింత భిన్నమైన చిత్రాన్ని మనముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకూ హాలీవుడ్‌కే తెలిసిన జాంబీలను తెలుగు తెరపై చూపించబోతున్నాడు.

Updated : 04 Feb 2021 21:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అ!’, ‘కల్కీ’ వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ. ఈసారి మరో అడుగు ముందుకేసి మరింత భిన్నమైన చిత్రాన్ని మనముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటి వరకూ హాలీవుడ్‌కే తెలిసిన జాంబీలను తెలుగు తెరపై చూపించబోతున్నాడు. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్లు. జబర్దస్త్‌ గెటప్‌ శ్రీను, పృథ్వీరాజ్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో నటులందర్నీ జాంబీలుగా చూపించడంతో పాటు తెరపై ఒక భీతిల్లే వాతావరణాన్ని చూపించేందుకు ఎంతో కష్టపడ్డామని డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ చెప్పిన విషయం తెలిసిందే. కాగా. ఈ సందర్భంగా చిత్రబృందం మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోను మీరూ వీక్షించండి మరి.

ఇదీ చదవండి...

సమీరా సీమంతం.. నదిలో రెజీనా శిక్షణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని