మణికట్టుపై మెరిసేలా..

స్మార్ట్‌వాచ్‌ల సందడి ఎప్పుడో మొదలైనా.. వన్‌ప్లస్‌ తనదైన ముద్ర వేసేలా కొత్త లుక్‌తో స్మార్ట్‌వాచ్‌లను దేశీయ...

Published : 31 Mar 2021 00:24 IST

గ్యాడ్జెట్‌ గురూ

స్మార్ట్‌వాచ్‌ల సందడి ఎప్పుడో మొదలైనా.. వన్‌ప్లస్‌ తనదైన ముద్ర వేసేలా కొత్త లుక్‌తో స్మార్ట్‌వాచ్‌లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. వన్‌ప్లస్‌ వాచ్‌ ప్రత్యేకత ఏంటంటే.. 46ఎంఎం వృత్తాకార డయల్‌. చూడ్డానికి శామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌ యాక్టివ్‌2ని పోలి ఉంటుంది. కుడివైపు అంచులో రెండు బటన్‌లను ఏర్పాటు చేశారు. పవర్‌, మల్టీ ఫంక్షన్‌ బటన్లు. తాకేతెర పరిమాణం 1.39 అంగుళాలు. రిజల్యూషన్‌ 454శ్రీ454 పిక్సల్‌. దీంట్లో సుమారు 110 రకాల వర్కవుట్‌ మోడ్స్‌ ఉన్నాయి. వాటిల్లో ఈత, రన్నింగ్‌, యోగా, డ్యాన్స్‌ వంటి వాటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. తడవకుండా, దుమ్ము పట్టకుండా వాటర్‌, డస్ట్‌ ప్రూఫ్‌లు ఉన్నాయి. automatic exercise detection ఆప్షన్‌తో యూజర్‌ ఎనేబుల్‌ చేయకపోయినా.. చేస్తున్న వర్కవుట్‌ని గుర్తించి ఆటోమేటిక్‌ ట్రాక్‌ చేయడం మొదలుపెడుతుంది. హార్ట్‌రేట్‌ సెన్సర్‌ ఉంది. ‘వన్‌ప్లస్‌ హెల్త్‌ యాప్‌’ని వాడుకుని యూజర్లు స్లీప్‌, స్ట్రెస్‌ లెవల్స్‌ని నిత్యం ట్రాక్‌ చేసుకుని చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని