బ్లూటూత్ ట్రాకర్ల బెడదకు గూగుల్ పరిష్కారం
అవాంఛిత బ్లూటూత్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవటానికి గూగుల్ ‘అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది అనుసంధానమైన బూటూత్ పరికరం గురించి తనుకుతానే హెచ్చరిస్తుంది.
అవాంఛిత బ్లూటూత్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవటానికి గూగుల్ ‘అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది అనుసంధానమైన బూటూత్ పరికరం గురించి తనుకుతానే హెచ్చరిస్తుంది. ఉదాహరణకు- యాపిల్ ఎయిర్‌ట్యాగ్ లేదా ఇతర బ్లూటూత్ ట్రాకింగ్ పరికరంతో ఎవరైనా మనల్ని అనుసరిస్తుంటే వెంటనే నోటిఫికేషన్ ద్వారా అప్రమత్తం చేసేస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ట్రాక్ చేస్తున్న పరికరం వివరాలు తెలుస్తాయి. ట్రాకర్ ఎక్కడుందో కూడా మ్యాప్‌లో కనిపిస్తుంది. అప్పుడేం చేయాలో కూడా చిట్కాల రూపంలో సూచిస్తుంది. ఇందులో ‘ప్లే సౌండ్’ ఆప్షన్ కూడా ఉంటుంది. దీని ద్వారా ట్రాకర్ పరికరం యజమానికి తెలియకుండానే సౌండ్ ద్వారా అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 6.0, తదనంతర వర్షన్ ఫోన్లు వాడేవారికి అందుబాటులో ఉంటుంది. దగ్గరలో ట్రాకర్లు ఏవైనా ఉన్నాయో తెలుసుకోవటానికీ ‘మాన్యువల్ స్కాన్’ ఫీచర్‌నూ గూగుల్ రూపొందించింది. సెటింగ్స్ ద్వారా సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్తే ఆన్‌నోన్ ట్రాకర్ కనిపిస్తుంది. దీన్ని తాకి ‘స్కాన్ నౌ’ ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. సుమారు 10 సెకండ్లలో స్కాన్ చేసి, సమీపంలో ఉన్న ట్రాకర్ల జాబితాను చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం