Twitter: ట్విటర్‌ నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌

సోషల్‌ మీడియా ఇప్పుడు వినోదం అందించేదే కాకుండా సంపాదనకు మార్గాలను చూపుతోంది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌తో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియమ్‌ బ్లూ పెయిడ్‌ సేవలను ..

Published : 23 Jun 2021 22:58 IST

ప్రస్తుతం అమెరికాలోనే.. త్వరలో ప్రపంచమంతా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా ఇప్పుడు వినోదం అందించేదే కాకుండా సంపాదనకూ మార్గాలను చూపుతోంది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌తో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియమ్‌ బ్లూ పెయిడ్‌ సేవలను ప్రారంభించిన ట్విటర్‌.. ఇవాళ రెండు సభ్యత్వ ప్రణాళికలను లాంచ్‌ చేసింది. సూపర్‌ ఫాలోస్, టికెటెడ్‌ స్పేసెస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను విడుదల చేసింది. వీటి ద్వారా ట్విటర్‌ యూజర్లు తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆర్జించడానికి మరింత అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం యూఎస్‌లో మాత్రమే  ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఛార్జ్‌ వసూలు చేయొచ్చు..

యూజర్లు తమ ఫాలోవర్స్‌తో కలిసి ప్రత్యేకమైన లైవ్‌ ప్రోగ్రామ్‌లను ట్విటర్‌ స్పేసెస్‌లో హోస్ట్‌ చేయొచ్చు. టికెటెడ్‌ స్పేసెస్‌ ఆప్షన్‌తో ఒక్కో సెషన్‌కు కనీసం ఒక్క డాలర్‌ నుంచి వెయ్యి డాలర్ల వరకు శ్రోతల నుంచి వసూలు చేయొచ్చు. యూజర్లు ప్రేక్షకుల పరిమాణాన్ని సెట్‌ చేయడానికి, వారు కోరుకున్నంత మందిని ఆహ్వానించడానికి అవకాశం ఉంది. సూపర్‌ ఫాలోస్‌ ఆప్షన్‌ వల్ల ఫాలోవర్స్‌కు ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ను అందించడం వల్ల నెలవారీ సంపాదన పొందొచ్చు. తాము అందించే కంటెంట్‌ను ఫాలోవర్లు పొందాలంటే కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంతనేది హోస్ట్‌ నిర్ణయం తీసుకుంటారు. నెలకు 2.99 డాలర్లు లేదా 4.99 డాలర్లు, 9.99 డాలర్లను ధరను కేటాయిస్తారు. ఫాలోవర్లు వీటిలో ఎదొక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 


కేవలం మూడు శాతమే కటింగ్‌

సూపర్‌ ఫాలోస్‌, టికెటెడ్ స్పేసెస్‌ కస్టమర్ల నుంచి ట్విటర్‌ కేవలం మూడు శాతం మాత్రమే కట్‌ చేస్తుంది. ఒక వేళ భవిష్యత్తులో యూజర్‌ సంపాదన 50 వేల డాలర్లు దాటితే ట్విటర్‌ షేర్‌ 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. యాపిల్‌, గూగుల్‌తో పోలిస్తే చాలా తక్కువనేనని ట్విటర్‌ అంటోంది. తాము విడుదల చేసిన కొత్త ఉత్పత్తులను ప్రయత్నించాలని యూఎస్‌ యూజర్లను ట్విటర్‌ ఆహ్వానించింది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని