Xiaomi: ఎక్కడ టచ్ చేసినా అన్‌లాక్!
మొబైల్స్‌లో కొత్త రకం ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని తీసుకొచ్చేలా షావోమీ పేటెంట్ హక్కులు తీసుకుంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ మొబైల్స్‌లో ప్రస్తుతం ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఎంత తప్పనిసరిగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొనే పలు దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను తప్పనిసరిగా అందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలైతే వాటి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో అండర్ డిస్‌ప్లే బయోమెట్రిక్ స్కానర్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌కు సంబంధించి చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ మరో అడుగు ముందుకు వేసింది.
మొబైల్స్‌లో కొత్త రకం ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని తీసుకొచ్చేలా షావోమీ పేటెంట్ హక్కులు తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా వినియోగదారులు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి రెండు మూడుసార్లు ప్రయత్నించాల్సిన పనిలేదు. అలాగే వేలిముద్రల గుర్తింపు కోసం నిర్దిష్ట ప్రదేశంలో తాకడం, పట్టుకోవాల్సిన అవసరమూ లేదు. బదులుగా వినియోగదారులు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి మొబైల్ డిస్‌ప్లే స్క్రీన్‌పై ఎక్కడైనా టచ్ చేయవచ్చు. ఈ మేరకు ఎల్‌ఈడీ ట్రాన్స్‌మిటర్‌ల ద్వారా ఈ టెక్నాలజీ పనిచేయనుంది.
అయితే, ఆల్-స్క్రీన్ టచ్-సెన్సిటివ్ సెన్సర్ వార్తల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆగస్టులో హువావే కంపెనీ ఇటువంటి సాంకేతికత కోసం పేటెంట్ సమర్పించింది. యాపిల్ సైతం తన భవిష్యత్తు మొబైల్స్‌లో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ తీసుకురానున్నట్లు గతంలో వెల్లడించింది. ఇప్పటివరకూ ఈ రెండు ఆచరణలోకి రాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర