106 మంది పొరుగుసేవల ఉద్యోగులపై వేటు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి రాజకీయ సమావేశంలో పాల్గొన్న పొరుగు సేవల ఉద్యోగులపై సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనుచౌదరి కొరడా ఝళిపించారు.

Updated : 10 Apr 2024 03:58 IST

 కోడ్‌ ఉల్లంఘనతో ఎన్నికల అధికారి చర్యలు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి రాజకీయ సమావేశంలో పాల్గొన్న పొరుగు సేవల ఉద్యోగులపై సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనుచౌదరి కొరడా ఝళిపించారు. ఏకంగా 106 మందిని మంగళవారం సస్పెండ్‌ చేశారు. మెదక్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డిలు ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారని కాంగ్రెస్‌, భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిలపై కేసు నమోదైంది. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో 68 మంది ఉపాధి హామీ, 38 మంది సెర్ప్‌ ఉద్యోగులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని