ప్రొటీన్‌ పౌడర్‌ తాగుతున్నారా?

బరువు వేగంగా తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధపెట్టేవారు ప్రొటీన్‌ పౌడర్లను తీసుకోవడం గమనిస్తుంటాం. అయితే వాడే ముందు మాత్రం కొన్ని గమనించుకోవాలి... 30 ఏళ్లు దాటాక మన ఎముకల్లో సాంద్రత తగ్గడం మొదలవుతుంది. కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్‌ వంటి వాటి బారిన పడొద్దంటే ప్రొటీన్‌ సరిగా తీసుకుంటున్నామా అన్నది గమనించుకోవాలి.

Published : 29 Apr 2024 02:19 IST

బరువు వేగంగా తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధపెట్టేవారు ప్రొటీన్‌ పౌడర్లను తీసుకోవడం గమనిస్తుంటాం. అయితే వాడే ముందు మాత్రం కొన్ని గమనించుకోవాలి...

30 ఏళ్లు దాటాక మన ఎముకల్లో సాంద్రత తగ్గడం మొదలవుతుంది. కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్‌ వంటి వాటి బారిన పడొద్దంటే ప్రొటీన్‌ సరిగా తీసుకుంటున్నామా అన్నది గమనించుకోవాలి. మన శరీరం సరిగా పనిచేయడానికి 20 రకాల అమైనో యాసిడ్‌లు అవసరం. ఇవన్నీ కలిసి శరీరంలో ప్రొటీన్‌లుగా మారతాయి. వీటిలో కొన్ని ఆహారం ద్వారానే అందుతాయి. ఇవి సక్రమంగా అందుతున్నాయా అని రోజూ గమనించుకోవడం కష్టం కదా! అందుకే చాలామంది ఎంపిక ‘ప్రొటీన్‌ పౌడర్లు’ అవుతున్నాయి.

లాభాలెన్నో...

సోయాబీన్‌, బఠాణి, వరి, బంగాళదుంప, గుడ్లు, పాలు... వంటివాటి నుంచి సాధారణంగా ఈ పౌడర్లను తయారు చేస్తుంటారు. ప్రొటీన్లు మెటబాలిజాన్ని మెరుగుపరిచి, అనవసర కొవ్వులను కరిగేలా చేస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. ప్రొటీన్‌ సంబంధిత పదార్థాలను తీసుకున్నాక చాలావరకూ ఆకలి వేయదు. అలా కెలోరీలు తగ్గుతాయి.
గత కొన్నేళ్లుగా ఆస్టియోపోరోసిస్‌ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. వయసుతోపాటు చర్మంలో కొల్లాజన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నెమ్మదిగా వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయి. అది వేగంగా జరగొద్దన్నా, కురుల ఎదుగుదల, గోళ్లు దృఢంగా ఉండాలన్నా తగినంత ప్రొటీన్‌ తప్పనిసరి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండానూ కాపాడతాయి.

అయితే జాగ్రత్త!

మార్కెట్‌లో బోలెడు రకాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే వాడే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరి. అయితే వీటిపైనే పూర్తిగా ఆధారపడటమూ మంచిది కాదు. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్లు, పప్పుధాన్యాలు, నట్స్‌, విత్తనాలు, పాలు వగైరాలకు ప్రాధాన్యమిస్తూనే దీన్ని అదనంగా తీసుకున్నప్పుడే ఆరోగ్య ప్రయోజనం చేకూరుతుందన్నది నిపుణుల మాట. మరి దాన్ని సరిగ్గానే అనుసరిస్తున్నారా అన్నది చెక్‌ చేసుకుంటారా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్