మల్బరీ పండ్లు తింటున్నారా?

మల్బరీ పండ్లు... వీటినే బొంతపండ్లు అనికూడా అంటారు. ఇవి నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఈ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువ.

Published : 01 May 2024 02:03 IST

మల్బరీ పండ్లు... వీటినే బొంతపండ్లు అనికూడా అంటారు. ఇవి నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఈ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువ. అలానే, విటమిన్లు - బి1,2,3, సి, ఇ, కెతో పాటు పొటాషియం, జింక్‌  దీన్నుంచి తగినంతగా శరీరానికి అందుతాయి.

  •  వీటిలో జీర్ణక్రియను మెరుగుపరిచే పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది పేగు కదలికను సులభతరం చేస్తుంది. జీర్ణసంబంధిత వ్యాధులతో బాధపడే వారు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఉపశమనం ఉంటుంది.
  • మల్బరీల్లో ఉండే పీచు బరువుని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే ఆంతోసైనిన్‌లు ఇందులో పుష్కలంగా ఉండి పెద్దపేగు, చర్మ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లను దరిచేరనివ్వవు. .
  • ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తాయి. దీంతో గుండె, ఇతర శరీరభాగాలకి రక్తప్రసరణ సరిగ్గా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది. ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రరక్తకణాలూ వృద్ధి చెందుతాయి.
  • రోగనిరోధకశక్తిని మెరుగు పరచడంలోనూ మల్బరీలు ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే విటమిన్‌- సి ఇన్‌ఫెక్షన్లను దరిచేరనీయదు.
  • విటమిన్‌- కె, కాల్షియం, ఐరన్‌ పోషకాలు ఎముకలు గుల్లబారకుండా కాపాడతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్