నడక నేర్చుకుంటూనే!

బుడిబుడి అడుగులేసేటప్పుడు పడుతూ లేచే బుజ్జాయిలను చూసిన ప్రతిసారీ భయపడుతుంటాం. తప్పటడుగులేస్తూనే... పరుగులు పెట్టాలనే వారి ఆసక్తి చూస్తుంటే ముచ్చటేసినా... గాయాలవకుండా కాపలా కాస్తుంటాం. బ్రేక్‌ లేకుండా వారి నడక సాగేలా వాకర్స్‌ సాయాన్నిస్తాం. అలా నడకతోపాటు ఆట, కొత్తపాఠాలను నేర్పే సరికొత్త డిజైన్‌ వాకర్లు వచ్చాయి.

Updated : 28 Apr 2024 06:56 IST

బుడిబుడి అడుగులేసేటప్పుడు పడుతూ లేచే బుజ్జాయిలను చూసిన ప్రతిసారీ భయపడుతుంటాం. తప్పటడుగులేస్తూనే... పరుగులు పెట్టాలనే వారి ఆసక్తి చూస్తుంటే ముచ్చటేసినా... గాయాలవకుండా కాపలా కాస్తుంటాం. బ్రేక్‌ లేకుండా వారి నడక సాగేలా వాకర్స్‌ సాయాన్నిస్తాం. అలా నడకతోపాటు ఆట, కొత్తపాఠాలను నేర్పే సరికొత్త డిజైన్‌ వాకర్లు వచ్చాయి. అవేంటో చూద్దాం.

బొమ్మల బండి... 10-12 నెలల మధ్య చిన్నారులు తమని తాము నిలబెట్టుకోవడానికి తగిన శక్తిని కూడబెట్టుకుంటారు. అడుగులేయడానికి ఏదైనా ఆసరా కోరుకుంటారు. ఆ సమయంలో వారు వినియోగించడం కోసం వాకర్‌ లేదా స్ట్రోలర్‌ను డిజైనర్లు ఇప్పుడు మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ప్లాస్టిక్‌, చెక్క స్టాండులకు చక్రాల ఏర్పాటుతో తేలిగ్గా కదులుతాయివి. అంతేనా, వీటిని నడక కోసం మాత్రమే కాకుండా బొమ్మలు పెట్టుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ రూపొందిస్తున్నారు. దీనివల్ల మధ్య మధ్యలో కాసేపు కూర్చునీ వాటితో ఆడుకుంటారు. అలాంటి బొమ్మల బండ్లే ఇవన్నీ. భలేగున్నాయి కదూ...!

ఆసక్తి కలిగిస్తూ... పిల్లలు నడిచేటప్పుడు ఆసరాగా నిలిచే వాకర్స్‌ ఇప్పుడు ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి. అదనపు హంగులెన్నో అద్దుకుని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రకరకాల జంతువులూ, పక్షుల బొమ్మలు, రంగుల్లో అక్షరాలు, ఇంద్రధనస్సుని తలపించే డిజైన్ల వంటివెన్నో వాకర్‌పై కనిపిస్తూ... చిన్నారులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇవన్నీ వారిని ఆకర్షిస్తూ, ఆడుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. కొత్త విషయాలను నేర్చుకునేలా చేసి పలు రకాల నైపుణ్యాలనూ అందిస్తున్నాయి. ఇలాంటి ఓ వాకర్‌ని మీ బుజ్జాయికీ అందించాలనిపిస్తోంది కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్