వైట్‌డిశ్చార్జ్‌ అవుతుంటే..!

ఆడవారిని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్లబట్ట ఒకటి. యోని ప్రాంతాలు శుభ్రం చేయకపోవడమూ ఇందుకు కారణం. మరికొన్నిసార్లు అలసట, ఒత్తిడి వల్ల కూడా ఏర్పడుతుంది. తెల్లబట్ట రంగునిబట్టి సమస్య తీవ్రతను గుర్తించవచ్చట. దీనివల్ల తల తిరగడం, దురద, వాసన, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Updated : 28 Apr 2024 01:42 IST

ఆడవారిని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్లబట్ట ఒకటి. యోని ప్రాంతాలు శుభ్రం చేయకపోవడమూ ఇందుకు కారణం. మరికొన్నిసార్లు అలసట, ఒత్తిడి వల్ల కూడా ఏర్పడుతుంది. తెల్లబట్ట రంగునిబట్టి సమస్య తీవ్రతను గుర్తించవచ్చట. దీనివల్ల తల తిరగడం, దురద, వాసన, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. దీనికి పరిష్కారంగా ఇంటి చిట్కాలు పాటించి చూడండి.

తులసి.. కొన్ని తులసి ఆకులను తీసుకుని పేస్టు చేసి దాంట్లో కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పాలల్లో లేదా వేడినీటితో వారానికి రెండుసార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఉసిరి.. రోజూ స్పూను ఉసిరిపొడిలో కాస్త తేనె వేసి చూర్ణం చేసుకుని తింటే సమస్య అదుపులోకి వస్తుంది.

దనియాలు-మెంతులు.. ఇవి రెండూ రెండు చెంచాలు చొప్పున తీసుకుని రెండు గ్లాసుల నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం గ్లాసు నీరు అయ్యేవరకు మరిగించి తీసుకోవాలి. వీటిల్లోని విటమిన్‌ సి తెల్లరక్తకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. గుప్పెడు జామాకులను రెండుగ్లాసుల నీటిలో మరిగించి హెర్బల్‌ టీ మాదిరిగా తీసుకోవాలి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్‌-సి తెల్లరక్త కణాలను ఉత్పత్తి చేసి గుల్లబారిన ఎముకలను తగ్గించి వైట్‌డిశ్చార్జ్‌ను నియంత్రిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్