Accenture: యాక్సెంచర్‌లో భారీగా ఉద్యోగాల కోత
కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) తెలిపింది.
డబ్లిన్: ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థల (IT Companies)ను ఆర్థిక మాంద్యం (Recession) భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విటర్, ఎరిక్సన్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున్న ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. తాజాగా ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన చేసింది. సుమారు 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇదే క్రమంలో కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధిరేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించుకుంది. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8-10 శాతంగా అంచనా వేసింది. గతేడాది అంచనాలతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ. ఇప్పటికే పలు కంపెనీలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. చాలా వరకు అమెరికన్ ఐటీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. గతంలో ఆయా సంస్థలు లేఆఫ్‌లు విధించిన సమయంలో భారత్‌లోని ఉద్యోగులపై కూడా ప్రభావం చూపింది. ఈ క్రమంలో యాక్సెంచర్ కోతల నిర్ణయంతో భారత్‌లో ఎంత మందిపై ప్రభావం ఉంటుందనేది తెలియాల్సివుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
గాంధీ జయంతి నాడు చంద్రబాబు, భువనేశ్వరి నిరసన దీక్ష
-
Heart Disease: రోజూ 50 మెట్లు ఎక్కండి.. గుండె జబ్బు ముప్పు తగ్గించుకోండి!
-
‘1,400 ఎకరాల డీల్ కోసమే సీఎం జగన్‌తో అదానీ రహస్య భేటీ’
-
వైతెపా విలీనంపై 4 రోజుల్లో దిల్లీ నుంచి పిలుపు!
-
పాపులర్ అవ్వడానికి బదులు దూరమయ్యా: జాన్వీకపూర్
-
నేటి నుంచి ఆన్లైన్ గేమింగ్ పూర్తి పందెం విలువపై 28% జీఎస్టీ