Adani Group: అదానీ పోర్ట్స్‌ 195 మిలియన్‌ డాలర్ల బాండ్ల బైబ్యాక్‌

Adani Group: అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఇన్వెస్టర్లలో సన్నగిల్లిన విశ్వాసాన్ని చూరగొనేందుకు అదానీ గ్రూప్‌ అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే తాజాగా బాండ్ల బైబ్యాక్‌ నిర్ణయం తీసుకుంది.

Published : 27 Sep 2023 17:18 IST

దిల్లీ: ‘అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (APSEZ)’ 195 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించేందుకు సిద్ధమైంది. 2024 వరకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది. తద్వారా అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఇన్వెస్టర్లలో సన్నగిల్లిన విశ్వాసాన్ని చూరగొనేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) అనేక చర్యలు చేపడుతోంది.

195 మిలియన్‌ డాలర్లు విలువ చేసే బాండ్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు ఇచ్చిన ఫైలింగ్‌లో అదానీ పోర్ట్స్‌ (APSEZ) వెల్లడించింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల ద్వారా ఈ చెల్లింపులను చేయనున్నట్లు పేర్కొంది. బైబ్యాక్‌ టెండర్‌ అక్టోబర్‌ 26 వరకు ఓపెన్‌ ఉంటుందని తెలిపింది. మొత్తం 520 మిలియన్‌ డాలర్ల అసలు చెల్లించాల్సి ఉంది. తాజా చెల్లింపుల తర్వాత 325 మిలియన్ డాలర్ల బకాయి మిగిలి ఉంటుందని కంపెనీ తెలిపింది.

అదానీ పోర్ట్స్‌ (APSEZ) గతంలోనూ 130 మిలియన్‌ డాలర్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. వాటి గడువు 2024 జులై వరకు ఉన్నప్పటికీ ముందుగానే చెల్లించేసింది. మిగిలిన మొత్తాన్ని 20 శాతం చొప్పున రాబోయే నాలుగు త్రైమాసికాల్లో పూర్తి చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే తాజాగా రెండో విడత కింద 195 మిలియన్‌ డాలర్ల చెల్లింపులు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని