Lionel Messi: ఇది ‘మెస్సి మండే’.. ఆనంద్‌ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్‌..

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను జగజ్జేతగా నిలిపిన సాకర్‌ మాంత్రికుడు మెస్సిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అతడి నుంచి ఎంతో నేర్చుకోవాలంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని పంచుకున్నారు.

Updated : 19 Dec 2022 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra). ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ షేర్ చేశారు. మరి నేటి స్ఫూర్తిదాయక సందేశం ఎవరి గురించో తెలుసా?ఇంకెవరు.. సాకర్‌ సమరం (FIFA Worldcup 2022)లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన ఫుట్‌బాల్‌ మాంత్రికుడు లియొనెల్‌ మెస్సి (Lionel messi) గురించే. ఆదివారం నాటి ఉత్కంఠ భరిత ఫైనల్‌ పోరులో అర్జెంటీనా (Argentina)కు ఘనమైన విజయాన్ని అందించిన మెస్సిపై మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

‘‘ఈ రోజు మండే మోటివేషన్‌ (#MondayMotivation) ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ నుంచి రాకుండా ఎలా ఉంటుంది? ఓ వ్యక్తికి అసాధారణ శక్తులు ఉంటే అతడిని మహా పురుషుడు (Messiah) అంటారు. మెస్సి (Messi).. తన అంకితభావం, కఠోర శ్రమతో అసాధారణ విజయాలు సాధించిన ఓ సాధారణ వ్యక్తి. మీరు కూడా మెస్సి (Messiah మహా పురుషుడు)లా ఉండండి’’ అని ఆనంద్‌ మహీంద్రా రాసుకొచ్చారు.

ఇక ‘‘ఈ సోమవారాన్ని గందరగోళంగా (Messy Monday) మొదలుపెట్టే బదులు దాన్ని ‘మెస్సీ మండే (Messi Monday) గా ఆరంభించండి’’ అని ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు మహీంద్రా స్పందిస్తూ ‘సరిగ్గా చెప్పార’ని కితాబిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని