2024 elections: మూడోసారీ మోదీ ప్రభుత్వమే.. ఫిచ్‌ అంచనా!

2024 elections: భారత్‌లో 2024 ఏప్రిల్‌- మేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాయే అధికారంలోకి వస్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.

Updated : 12 Dec 2023 19:49 IST

దిల్లీ: భారత్‌లో 2024 ఏప్రిల్‌- మేలో సార్వత్రిక ఎన్నికలు (2024 general elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రానున్నారనే అంశంపై వివిధ రకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్‌ (Fitch) కీలక వ్యాఖ్యలు చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా (BJP) స్పష్టమైన మెజారిటీతో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేసింది. తద్వారా వరుసగా మూడోసారీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విధానపరమైన సంస్కరణల పరంపర కొనసాగుతుందని పేర్కొంది.

అయితే, భారత్‌లో సార్వత్రిక ఎన్నికల్లో (2024 general elections) అధికారాన్ని దక్కించుకునే పార్టీకి వచ్చే మెజారిటీ.. సంస్కరణల ఎజెండాను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఫిచ్‌ (Fitch) అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని భాజపా 2014లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019లోనూ గెలుపొంది అధికారం నిలబెట్టుకుంది. 2024 ఏప్రిల్‌-మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసారి కూడా మోదీ ప్రభుత్వమే మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుందనేది ఫిచ్‌ తాజా అంచనా.

మరోవైపు జనవరిలో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్‌లోనూ ప్రస్తుత ప్రభుత్వమే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఫిచ్‌ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని